NTV Telugu Site icon

Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు

Israel

Israel

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై గాజా హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజల్ని బందీలుగా చేసుకున్నారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ సైన్యం, గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా కుప్పకూల్చే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ ఇప్పటికే ప్రకటించింది. గాజా మొత్తాన్ని ఇజ్రాయిల్ ఆర్మీ చుట్టుముట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 9000కు పైగా పాలస్తీనియన్లు మరణించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయిల్ హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. హమాస్‌‌తో జరుగుతున్న పోరులో ‘అణు బాంబు వేయడం ఓ ఆప్షన్’ అని ఆయన అన్నారు. ఇజ్రాయిల్ లోని ఓట్జ్మా యెహుదిత్ పార్టీ సభ్యుడు, ఎలియాహు రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశారు.

Read Also: Mumbai: మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయం.. మహిళపై పలుమార్లు అత్యాచారం…

అయితే మంత్రి చేసిన ప్రకటనపై ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహూ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యల్ని నిందించారు. ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అమాయకులకు హాని కలిగించకుండా ఉండటానికి అంతర్జాతీయ చట్టం, అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది, మా విజయం వరకు మేము దీన్ని కొనసాగిస్తామని ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధాని యాయిర్ లాపిడ్ కూడా ఎలియాహుని విమర్శించారు. బాధ్యతా రహిత మంత్రిని తొలగించాలని పిలుపునిచ్చారు.

గాజా నివాసితులన ‘నాజీలు’గా పిలుస్తూ, వారికి మానవతా సాయం కూడా అందించడాని ఎలియాహు వ్యతిరేకించారు. గాజాను తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ నివాసాలను పునరుద్ధరించాలని, గాజా ఇజ్రాయిల్‌కు వస్తే, గాజాలోని రాక్షసులు ఎడారులకు వెళ్లవచ్చని ఎలియాహు అన్నారు. ఉత్తర గాజా ప్రాంతం ఉనికిలో ఉండే హక్కు లేదని వ్యాఖ్యానించారు. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా నెతన్యాము మంత్రి వర్గ సమావేశాల నుంచి మంత్రిని నిరవధికంగా సస్పెండ్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.