Site icon NTV Telugu

Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్

Idf

Idf

ఇజ్రాయెల్‌ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ కొండపై కూలిపోయింది. రికవరీ లిఫ్ట్ ఆపరేషన్ సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. మాలే అమోస్ సమీపంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇజ్రాయెల్‌కు చెందిన UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా మంగళవారం గుష్ ఎట్జియన్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అప్పటి నుంచి అక్కడే ఉంది. దీంతో శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు CH-53 యాసూర్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ సాయంతో UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ధృడమైన కేబుల్స్ ఉపయోగించి తీసుకెళ్తుండగా గాల్లో ఉండగా కేబుల్స్ ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ కొండపై కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: ఎన్నికల ముంగిట నేడు బెంగాల్‌కు మోడీ.. వందే భారత్ స్లీపర్‌ను ప్రారంభించనున్న ప్రధాని

ప్రమాద సమయంలో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ వైమానిక దళం చీఫ్, మేజర్ జనరల్ టోమర్ బార్ తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ప్రత్యేక లిఫ్టింగ్ పరికరాల సమగ్రత, సైనిక పునరుద్ధరణ సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రొటోకాల్‌లపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వెస్ట్‌ బ్యాంక్‌లో తీవ్రమైన చలిగాలులు ఉంటాయి. సైనిక కార్యకలాపాలతో పాటు పౌరుల కార్యక్రమాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఈ ప్రమాదం జరిగింది.

 

 

 

Exit mobile version