NTV Telugu Site icon

Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడిలో మరో హమాస్ కమాండర్ హతం

Israelhamas War

Israelhamas War

హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే గాజాను మట్టుబెట్టింది. ప్రస్తుతం హమాస్ నాయకులే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆ మధ్య హమాస్ అగ్ర నేత హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లో స్థానిక హమాస్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీలో పలువురికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు, పోస్టింగులు

పాలస్తీనా భూభాగంలో కాల్పులు, బాంబు దాడులకు ఇజ్రాయెల్ పాల్పడింది. జెనిన్‌లోని హమాస్‌కు అధిపతిగా ఉన్న వాసేమ్ హజెమ్‌ను బోర్డర్ పోలీసులు హతమార్చినట్లుగా మిలటరీ తెలిపింది. కారులోంచి తప్పించుకునే ప్రయత్నంలో మరో ఇద్దరు హమాస్ ముష్కరులు కూడా హతమయ్యారని పేర్కొంది. వాహనంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ దళాలు వెంబడించి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే హమాస్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇది కూడా చదవండి: Viral post: ఆఫీస్ నుంచి “ఒక నిమిషం” ముందు వెళ్లిపోయినందుకు నోటీసులు.. వైరల్ అవుతున్న పోస్ట్..

గతేడాది అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. అనంతరం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఇప్పటికే వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఇరాన్‌లో హమాస్ అగ్ర నేత హనియే హత్యకు గురయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ కూడా.. ఇజ్రాయెల్‌పై పగతో రగిలిపోతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: Balakrishna @ 50 Years: జై బాల‌య్య‌ అనకుండా ఉండగలరా!!!