హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటికే గాజాను మట్టుబెట్టింది. ప్రస్తుతం హమాస్ నాయకులే టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఆ మధ్య హమాస్ అగ్ర నేత హనియేను ఇజ్రాయెల్ హతమార్చింది. తాజాగా వెస్ట్ బ్యాంక్‌లో స్థానిక హమాస్ కమాండర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.