NTV Telugu Site icon

Israel: ఇజ్రాయిల్ దూకుడు, ఎయిర్‌పోర్ట్ హ్యాక్.. ఇరాన్ ఫ్లైట్ ల్యాండ్ అయితే పేల్చేస్తాం..

Lebanon

Lebanon

Israel: ఇజ్రాయిల్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తమపై దాడి చేసే వారిని వదిలేది లేదని చాలా సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, శుక్రవారం జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. అతడి మరణంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి.

Read Also: Whatsapp: నంబర్‌ సేవ్ చేయకుండా ఈ ట్రిక్‌తో వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు..!

ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ సైన్యం శనివారం లెబనాన్ రాజధాని బీరూట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ని హ్యాక్ చేసింది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్ విమానానికి బెదిరింపులు జారీ చేసింది. ఒక వేళ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయితే, ఫ్లైట్‌ని పేల్చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ విమానం లెబనీస్ గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించాలని లెబనీస్ రవాణా మంత్రిత్వ శాఖ విమానాశ్రయ అధికారులను ఆదేశించింది.

అయితే, ఈ నివేదికలపై ఇజ్రాయిల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి కొన్ని గంటల ముందు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. బీరూట్ విమానాశ్రయం ద్వారా హిజ్బుల్లాకు ఎలాంటి ఆయుధాలు అందడానికి ఇజ్రాయిల్ సైన్యం అనుమతించదని హెచ్చరించింది. ఇరాన్ హిజ్బుల్లాకు ఆయుధాలు అందిస్తుందని మాకు తెలుసు.. ఆయుధాలను మోసుకెళ్లే శత్రు విమానాలను బీరూట్‌లోకి అనుమతించబోమని, ఇది పౌరులకు చెందిన ఎయిర్‌పోర్టు అలాగే ఉండాలి అని హగారి అన్నారు. అయితే, ఇజ్రాయిల్ వాదనల్ని లెబనాన్ రవాణా మంత్రి అలీ హమీహ్ ఖండించారు. బీరూట్ విమానాశ్రయానికి ఎలాంటి అయుధాలు అందడం లేదని చెప్పారు.