Houthi-Israel: హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు.. వీడియోలు వైరల్
- హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు
- ఆరుగురు మృతి.. పలువురి పరిస్థితి విషమం
- వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. యెమెన్ రాజధాని సనాలో అధ్యక్ష భవనం సమీపంలో ఇంధన గిడ్డంగి, రెండు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి చేసింది. దీంతో భారీ విస్ఫోటనం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. 86 మంది గాయపడ్డారని.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Jammu: జమ్మూలో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం.. 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇరాన్ మద్దతుతో హౌతీయులు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఇజ్రాయెల్ ముందుగానే గుర్తించి ఎటాక్ చేసింది. టెల్‌అవీవ్‌లోని ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండ్ సెంటర్ నుంచి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేయాలని ప్లాన్ చేస్తే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. దాడుల్లో యెమెన్‌లోని హౌతీ అధ్యక్ష భవనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. హౌతీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేస్తామని.. ఆ లక్ష్యాలను చేధిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. ఇతడేం చేశాడంటే..!
అధ్యక్ష భవనం దగ్గరగా సహా వివిధ ప్రాంతాల్లో పేలుళ్ల పెద్ద శబ్దాలు వినిపించినట్లు నివాసితులు తెలిపారు. సనా రాజధాని అంతటా విద్యుత్, గ్యాస్ స్టేషన్‌తో సహా అనేక ప్రాంతాలను క్షిపణులు తాకినట్లు హౌతీ మీడియా కార్యాలయం తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీలు 22 నెలలకు పైగా ఇజ్రాయెల్ వైపు క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అలాగే ఎర్ర సముద్రంలో ఓడలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా హౌతీయులు చెబుతున్నారు.
🚨🇮🇱🇾🇪 ISRAEL STRIKES SANAA – MISSILE BASES, PRESIDENTIAL PALACE
Heavy Israeli airstrikes hit Houthi missile bases in the Yemeni capital just now, with blasts reported across Sanaa.
Local sources say one strike slammed near the presidential palace compound, a direct shot at… https://t.co/OS4UG7ef7t pic.twitter.com/XwRrhCaMTr
— Mario Nawfal (@MarioNawfal) August 24, 2025
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..