Site icon NTV Telugu

Houthi-Israel: హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు.. వీడియోలు వైరల్

Israelattack

Israelattack

హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. యెమెన్ రాజధాని సనాలో అధ్యక్ష భవనం సమీపంలో ఇంధన గిడ్డంగి, రెండు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి చేసింది. దీంతో భారీ విస్ఫోటనం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. 86 మంది గాయపడ్డారని.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Jammu: జమ్మూలో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం.. 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు

ఇరాన్ మద్దతుతో హౌతీయులు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తుండగా ఇజ్రాయెల్ ముందుగానే గుర్తించి ఎటాక్ చేసింది. టెల్అవీవ్‌లోని ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండ్ సెంటర్ నుంచి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేయాలని ప్లాన్ చేస్తే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. దాడుల్లో యెమెన్‌లోని హౌతీ అధ్యక్ష భవనం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. హౌతీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేస్తామని.. ఆ లక్ష్యాలను చేధిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Rekha Gupta: రేఖా గుప్తా దాడి కేసులో మరో నిందితుడు అరెస్ట్.. ఇతడేం చేశాడంటే..!

అధ్యక్ష భవనం దగ్గరగా సహా వివిధ ప్రాంతాల్లో పేలుళ్ల పెద్ద శబ్దాలు వినిపించినట్లు నివాసితులు తెలిపారు. సనా రాజధాని అంతటా విద్యుత్, గ్యాస్ స్టేషన్‌తో సహా అనేక ప్రాంతాలను క్షిపణులు తాకినట్లు హౌతీ మీడియా కార్యాలయం తెలిపింది. ఇరాన్ మద్దతుగల హౌతీలు 22 నెలలకు పైగా ఇజ్రాయెల్ వైపు క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అలాగే ఎర్ర సముద్రంలో ఓడలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా హౌతీయులు చెబుతున్నారు.

 

Exit mobile version