NTV Telugu Site icon

Israel: ‘పాలస్తీనా ఒసామా బిన్ లాడెన్’ని చంపేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ..

Yahya Sinwar

Yahya Sinwar

Israel: ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడిన ఒక్కో హమాస్ కీలక నేతల్ని ఇజ్రాయిల్ ఆర్మీ హతం చేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఉగ్రవాదులు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడుల్లో హతమయ్యారు. ఇందులో హమాస్ ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా ఫోర్స్’ కమాండర్ అయిన అల్ కేద్రాను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.

ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ పై హమాస్ దాడులకు సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది యాహ్యా సిన్వార్‌ని చంపుతామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇతడిని ‘పాలస్తీనా ఒసామా బిన్ లాడెన్’గా అభివర్ణించింది. 1,300 మంది ఇజ్రాయెల్‌లను చంపిన అక్టోబర్ 7 దాడికి ప్రధాన సూత్రధారి అయిన హమాస్ అగ్ర కమాండర్ యాహ్యా సిన్వార్‌ను చంపుతామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రతిజ్ఞ చేసింది. అతడిని ‘ఈవిల్ ఫేస్’గా ఇజ్రాయిల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ అభివర్ణించాయి.

Read Also: Breaking News: ఢిల్లీలో భూకంపం..3.1 తీవ్రతతో కంపించిన భూమి..

యాహ్యా సిన్వార్ బిన్ లాడెన్ లాగే ఈ దాడిని చేశారని ఐడీఎఫ్ పేర్కొంది. అతడు పాలస్తీయన్లను చంపుతూ అతని కెరీర్ ని నిర్మించుకున్నాడని ఆరోపించింది. అతని వృత్తి హత్యలు చేయడమే అని, అతడు ఖాన్ యూనిస్ కసాయిగా మారాడని, ఎక్కడున్నా కనుగొని చంపేదాకా విశ్రమించబోమని ఐడీఎఫ్ తెలిపింది. అతను, అతని టీం ఎక్కడ ఉందో మా దృష్టిలో ఉన్నారని హెచ్చరించింది.

సిన్వార్ ప్రస్తుతం గాజా స్ట్రిప్ ని నియంత్రిస్తున్న హమాస్ ఉగ్రసంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. అతను రెండేళ్లు ఇజ్రాయిల్ లో శిక్ష అనుభవించాడు. అయితే ఇజ్రాయిల్ సైనికుడు గిలాడ్ షాలిత్ కోసం 2011లో ఖైదీల మార్పిడి సమయంలో 1026 మందిని ఇజ్రాయిల్ విడిచిపెట్టింది. దీంట్లో సిన్వార్ ఒకడు.
అక్టోబర్7న ఇజ్రాయిల్ పై జరిగిన హమాస్ దమనకాండలో 1300 మంది అమాయకులు చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలోని పాలస్తియన్లు చనిపోతున్నారు. అక్కడి మరణాల సంఖ్య 2329కి చేరింది. మొత్తంగా ఈ యుద్ధంలో 3200 మంది మరణించారు.