Site icon NTV Telugu

Artificial intelligence (AI): హమాస్ యుద్ధంలో ఏఐ టెక్నాలజీని వాడుతున్న ఇజ్రాయిల్..

Hamas War

Hamas War

Artificial intelligence (AI): ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. వైమానికి, భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడుతోందనే నివేదికలు వెలువడ్డాయి. గాజాలోని హమాస్ లక్ష్యాలను టార్గెట్ చేయడంతో పాటు పౌరమరణాల సంఖ్యను ముందుగానే అంచనా వేయగానికి ఈ వ్యవస్థని ఉపయోగిస్తోంది.

ఐడీఎఫ్ బలగాలు హిబ్సోరా(హిబ్రూలో ‘‘ది గాస్పెల్’’) అనే ఏఐ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు గతవారం నివేదికలు వెలువడ్డాయి. సైనికుల ప్రాణాలు రక్షించడంతో పాటు అత్యంత ఖచ్చితత్వంతో తీవ్రమైన దాడులు చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఏఐ సిస్టమ్ సైనికులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సహకరిస్తోంది. ఇజ్రాయిల్ ఏఐ హబ్సోరా వ్యవస్థ హమాస్‌తో యుద్ధంలో పలు స్థాయిల్లో ఇంటెలిజెన్స్, నిఘాకు సపోర్ట్ చేస్తోంది. మానవ ప్రయేమం లేకుండా లక్ష్యాలను ఎంచుకుని ప్రాణాంతక ఆయుధ వ్యవస్థని ఉపయోగించునే అవకాశం ఉంది.

Read Also: Lawyers Boycott Court : కోర్టు విధులను బహిష్కరించిన లాయర్లు.. స్పందించిన హైకోర్టు

అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 1200 మందిని హమాస్ దారుణంగా హతమార్చింది. మరో 240 మందిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై భారీగా దాడులు చేస్తోంది. ముఖ్యంగా హమాస్ ఉగ్రనేతలు, వారి కార్యకర్తలు ఉన్న ప్రాంతాలను గుర్తించి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో 17 వేల మంది పాలస్తీనియన్లు యుద్ధంలో మరణించారు. మొన్నటి వరకు ఉత్తర గాజాకే పరమితమైన దాడులు ఇప్పడు దక్షిణ గాజాకు విస్తరించింది. ఇన్నాళ్లు సురక్షితమని భావించిన ప్రాంతంలో కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది.

Exit mobile version