NTV Telugu Site icon

Israel strikes: హెజ్‌బొల్లా గ్రూప్‌ ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ దాడులు..

Isreal

Isreal

Israel strikes: లెబనాన్‌లోని బీరుట్‌లో ఉన్న హెజ్‌బొల్లా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బ తీయటమే టార్గెట్ గా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగిస్తుంది. హెజ్‌బొల్లాకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్న గ్రూప్‌లకు ఇజ్రయెల్‌ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, బీరుట్ దక్షిణ ప్రాంతంపై క్షిపణులతో దాడులను ప్రయోగించింది. బీరుట్‌లోని లెబనాన్‌ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక, దిక్కు తోచని పరిస్థితుల్లో బీరుట్‌ నుంచి వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లియారు. హెచ్చరికల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం.. పలు చోట్ల పేలుళ్లకు పాల్పడింది. ఈ క్రమంలో భయంతో లెబనాన్ ప్రజలు మూకుమ్మడిగా వీధుల్లోకి రావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Read Also: Indian UPI In Maldives: మాల్దీవులలో ఇకపై ఇండియన్ యూపీఐ.. మొహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం

ఇక, అంతకు ముందు ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం.. ఉత్తర గాజాలోని బీట్ లాహియాపై దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 73 మంది చనిపోగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని గాజా అధికారులు ప్రకటించారు. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయెల్ సైనిక ముట్టడితో ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా మారిపోయింది. గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఆహారం, నీరు, ఔషధం లాంటి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో హెజ్‌బొల్లా డ్రోన్ దాడి చేయడంతో.. ప్రతిస్పందనగా హెజ్‌బొల్లా ఆర్థిక మూలాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.