Site icon NTV Telugu

Israel: గాజా పౌరులను హమాసే హత్య చేసింది.. ఇవిగో ఆధారాలన్న ఐడీఎఫ్

Idfhamas

Idfhamas

గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ప్రపంచ మీడియా కూడా ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేసింది.

ఇది కూడా చదవండి: Viral Video: ఆటో డ్రైవర్‌ని చెప్పుతో కొట్టిన మహిళ, ఆ తర్వాత కాళ్లపై పడి క్షమించాలని వేడుకోలు..

అయితే ఈ దాడిని వెంటనే ఐడీఎప్ ఖండించింది. కానీ హమాస్ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దాడులకు పాల్పడింది హమాస్ ఉగ్రవాదులేనని.. ఇవిగో ఆధారాలంటూ డ్రోన్‌ వీడియోను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యూమానిటేరియన్‌ ఫౌండేషన్‌ ఆదివారం రఫాలో ఆహారం పంపిణీ చేస్తోంది. ఇంతలో కాల్పులు చోటుచేసుకోవడంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. అయితే ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని హమాస్ ఆరోపించింది. అమాయకులను పొట్టన పెట్టుకుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి కూడా స్వచ్చంధ సంస్థను తప్పుపట్టింది. గాజా హ్యూమానిటేరియన్‌ ఫౌండేషన్‌.. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా జనాలను గుమిగూడిలా చేసి ప్రాణాలు తీసిందని ఆరోపించింది.

అయితే తాజాగా ఐడీఎఫ్ విడుదల చేసిన డ్రోన్ దాడిలో ఓ గన్‌మెన్ కాల్పులకు తెగబడ్డాడు. ఆహారం తీసుకుంటున్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 31 మంది చనిపోయారు. హమాస్ తన చేతిలో ఉన్న శక్తినంతా ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది.

Exit mobile version