Site icon NTV Telugu

Iran-Israel: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ రంగం సిద్ధం.. వాషింగ్టన్ పోస్ట్ కథనం

Israelpm

Israelpm

ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలు చేసుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు నివేదించాయి. ఇదే విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లు కథనాలు వెలువరిచాయి. ఈ ఏడాది మధ్యలో దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. హమాస్‌తో యుద్ధం జరిగిస్తున్న సమయంలో కూడా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ సమయంలో కోలుకోలేని దెబ్బకొట్టినట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా అంతకంటే ఎక్కువగా దాడులు చేయొచ్చని సమాచారం. ఇక ఈ దాడులకు ట్రంప్ మద్దతు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: LOC : భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఐదుగురు సైనికులు మృతి

అమెరికా నుంచి మద్దతు లభిస్తే.. ఇరాన్‌పై నేరుగా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగే అవకాశం ఉంది. హమాస్‌తో యుద్ధం జరిగిస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌పై 170 రాకెట్లు ప్రయోగించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గగనతలంలోనే రాకెట్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడి చేసింది.

ఇది కూడా చదవండి: Bird Flu: ఏలూరులో ఓ వ్యక్తికి సోకిన బర్డ్‌ ఫ్లూ..! క్లారిటీ ఇచ్చిన కలెక్టర్

Exit mobile version