NTV Telugu Site icon

Netanyahu: ఐరాస వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Netanyahu

Netanyahu

పశ్చిమాసియాలో ఉద్రిక్తల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ.. తమ లక్ష్యాలు పూర్తయ్యే వరకు హమాస్, హిజ్బుల్లా మీద పోరాటం ఆగదని అంతర్జాతీయ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ సగం బలగాలను అంతం చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra: ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ, మరదలికి పంచాయితీ షాక్..

అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై హఠాత్తుగా దండెత్తింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకుపోయారు. ఆ ఘటనతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. హమాస్ లక్ష్యంగా గాజాను ధ్వంసం చేసింది. హమాస్‌కు వత్తాసు పలికిన లెబనాన్‌పై కూడా దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా ఐరాస వేదికగా నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 90 శాతం మంది హమాస్‌ రాకెట్లను నాశనం చేసినట్లు చెప్పుకొచ్చారు. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశామని.. వారు లొంగిపోకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతామని చెప్పారు. మా లక్ష్యాలను చేరేవరకు హెజ్బుల్లాపై పోరాటం కొనసాగిస్తామని శపథం చేశారు. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నామని బెంజమిన్‌ నెతన్యాహు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: AP Excise Policy: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు యంత్రాంగం సిద్ధపడాలి..

ఈసారి ఐరాస సమావేశాలకు రావాలనే ఉద్దేశం లేనప్పటికీ.. తమపై కొన్ని దేశాధినేతలు చేసిన అవాస్తవాలను ఖండించడానికే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌ శాంతిని కోరుకుంటుదన్నారు. ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని.. దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఇటీవల నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాపై పూర్తి స్థాయిలో దాడులు చేయాలని ఆదేశించారు. ఇక ఇజ్రాయెల్‌ ముందుగా హెచ్చరించినట్లుగానే మరో అడుగు ముందుకేసింది. లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా భూతల దాడులు చేసేందుకు సరిహద్దు ప్రాంతంలో వేల సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లను మోహరించింది. దీంతో ఏ క్షణమైనా గ్రౌండ్‌ ఆపరేషన్‌ చేపట్టే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Israel-Lebanon: లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధం.. సరిహద్దులో యుద్ధ ట్యాంకులు