Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఇజ్రాయిల్ నో..
- తాను ఉన్నంత వరకు పాలస్తీనా దేశం ఉండదన్న నెతన్యాహూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘‘గాజా శాంతి ప్రణాళిక’’ ను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తిరస్కరించారు. ఆయన గాజా లేదా వెస్ట్ బ్యాంక్‌తో పాలస్తీనా దేశం ఏర్పాటును తోసిపుచ్చారు. 15-అంశాల గాజా పీస్ ప్లాన్‌ను ఆదివారం తిరస్కరించారు. ట్రంపునకు ఇది ఎదురుదెబ్బగా మారింది. ‘‘నేను ప్రధానిగా ఉన్నంత కాలం, పాలస్తీనా దేశం ఉండదు’’ అని నెతన్యాహూ అన్నట్లు ఇజ్రాయిల్ మీడియా నివేదించింది.
గాజా ప్లాన్‌ను తిరస్కరించడంతో పాటు హమాస్ పూర్తిగా నిరాయుధమయ్యే వరకు ఇజ్రాయిల్ గాజా నుంచి వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు. ఈ రోడ్ మ్యాప్‌ను ట్రంప్ ‘‘కీలక మైలురాయి’’, ‘‘గొప్ప పురోగతి’’గా అభివర్ణించిన వారం రోజుల తర్వాత నెతన్యాహూ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇదిలా ఉంటే, ఈ ప్రణాళికకు హమాస్ అంగీకరించింది. శాంతి ప్రణాళిక అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని హమాస్ కోరింది. ఈ ప్రణాళికలో భాగంగా తదుపరి దశకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు హమాస్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
మరోవైపు, ఇజ్రాయిల్ తీరుపై ముస్లిం దేశాలు విమర్శలు చేస్తున్నాయి. వారం రోజుల క్రితం యూఏఈతో పాటు ఏడు ముస్లిం దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ సైనిక చర్యను తీవ్రంగా విమర్శించాయి. ఇజ్రాయిల్ చర్యలు గాజా యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ రూపొందించిన శాంతి ప్రణాళికకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!