Israel: హమాస్ డిప్యూటీ లీడర్ ఇంటిపై ఇజ్రాయిల్ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్, హమాస్ ఉగ్రవాద సంస్థను నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో ఉంది. వెతికివెతికి కీలక హమాస్ నాయకులను టార్గెట్ చేస్తూ హతమారుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది మరణించారు. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ హమాస్‌ని నేలమట్టం చేస్తామని ప్రమాణం చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా వెస్ట్ బ్యాంకులోని హమాస్ కీలక నేత, డిప్యూటీ లీడర్ ఇంటిపై ఇజ్రాయిల్ దాడులు చేసింది. అతని కుటుంబాన్ని అదుపులోకి తీసుకుంది. శనివారం ఈ దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. హమాస్ అధినేతగా ఇస్మాయిల్ హనియే ఉండగా.. అతని తర్వాతి స్థానంలో డిప్యూటీగా సలేహ్ అల్-అరూరి ఉన్నారు. ఇస్లామిస్ట్ గ్రూప్ సైనిక విభాగంలో అరూరి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
Also Read
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also: Mangalavaram: మంగళవారం అని అందుకే పెట్టాం… ఆ సామెత పట్టించుకోవద్దు: అజయ్ భూపతి`
సలేహ్ అల్-అరూరి ఇజ్రాయిల్ ప్రధాన టార్గెట్లలో ఒకడిగా ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంకులోని రమల్లాకు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలోని అరూరా గ్రామంలోని అరూరి ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేసింది.అతని సోదరుడితో పాటు అతని 9 మంది మేనల్లుళ్లతో సహా 20 మందికి పైగా వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మేయర్ అలీ అల్ -ఖాసిబ్, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
2017లో హనియే డిప్యూటీగా ఉన్న అరూరి అనేక దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. సలేహ్ అల్-అరూరి దాదాపుగా 20 ఏళ్ల పాటు ఇజ్రాయిల్ జైలులో గడిపాడు. అతను ప్రవాసంలోకి వెళ్లాలనే షరతుపై 2010లో విడుదలయ్యారు. గాజాలో వివాదం మొదలైన తర్వాత వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయిల్ దళాలతో జరిగిన సంఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!