Site icon NTV Telugu

US: ట్రంప్‌తో నెతన్యాహు భేటీ.. నోబెల్ శాంతి బహుమతికి ఇజ్రాయెల్ మద్దతు

Usisrael

Usisrael

నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ అర్హుడని.. దాన్ని పొందాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆకాంక్షించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని నెతన్యాహు కొనియాడారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ చాలా చేశారని ప్రశంసించారు. వైట్ హౌస్‌లోని బ్లూ రూమ్‌లో సమావేశమైన ట్రంప్‌కు నెతన్యాహు లేఖ అందజేశారు. ఇక నెతన్యాహు నామినేషన్ చూసి ట్రంప్ ఆశ్చర్యపోయినట్లు కనిపించింది. మీ నుంచి మద్దతు లభించడం చాలా అర్థవంతంగా ఉందని.. చాలా ధన్యవాదాలు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.

ఇది కూడా చదవండి: Rajasab : ‘రాజాసాబ్’ లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. మాస్ ఆడియెన్స్‌కు పండుగే !

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సోమవారం అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయ్యారు. మూడు దఫాలుగా సమావేశాలు జరిగాయి. గాజాలో సైనికుల కొనసాగింపు, బందీల విడుదలపై పెరుగుతున్న ఒత్తిడిపై చర్చలు జరిగాయి. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం ప్రధానంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో నెతన్యాహుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌లతో కూడా సమావేశం అయ్యారు. ఇలా విడివిడిగా నెతన్యాహు సమావేశాలు నిర్వహించారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. వైట్ హౌస్ సమీపంలోని అధ్యక్షుడి అతిథి గృహం బ్లెయిర్ హౌస్‌లో ఈ చర్చలు జరిగాయి.

ఇది కూడా చదవండి: Tollywood : సెకండాఫ్ సమరానికి స్టార్స్ రెడీ.. బోణి కొట్టబోతున్న పవర్ స్టార్

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఇక భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లుగా ట్రంప్ చెప్పుకున్నారు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు. ప్రస్తుతం హమాస్-ఇజ్రాయెల్ మధ్య కూడా 60 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను నామినేట్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.

 

Exit mobile version