Site icon NTV Telugu

12 ఏళ్ల బెంజమిన్ పాల‌న‌కు తెర‌… ఇజ్రాయిల్‌కు కొత్త ప్ర‌ధాని…

ఇజ్రాయిల్ ప్ర‌ధానిగా బెన్నెట్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.  ఇటీవ‌ల జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో బెంజ‌మిన్ నెత‌న్యాహు పార్టీ ఒట‌మిపాలైంది.  ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స‌రైన మెజారిటీ రాక‌పోవ‌డంతో భిన్న‌మైన సిద్దాంతాలు క‌లిగిప ప్ర‌తిప‌క్ష‌పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ పార్టీలు త‌మ నాయ‌కుడిగా బెన్నెట్ ను ఎంచుకున్నాయి.  దీంతో బెన్నెట్ ఇజ్రాయిల్ ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.  కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంతో ఇజ్రాయిల్‌-గాజా మ‌ధ్య వివాదానికి తెర‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని పాల‌స్తీనా ప్ర‌జ‌లు భావిస్తున్నారు.  ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మ‌ధ్య వివాదం న‌డుస్తున్న‌ది.  క‌రోనా మ‌హ‌మ్మారిని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నా, స‌రిహ‌ద్దుల్లో దాడుల కార‌ణంగా బెంజ‌మిన్ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాల‌య్యారు.  గ‌త 12 ఏళ్లుగా ఇజ్రాయిల్ ను న‌డిపించిన బెంజ‌మిన్ నెత‌న్యాహు పాల‌న‌కు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది.  ఇక కొత్త ప్ర‌ధాని బెన్నెట్‌కు అమెరికా అధ్య‌క్షుడు శుభాకాంక్ష‌లు తెలిపారు.  కొత్త ప్ర‌ధానితో క‌లిసి ప‌నిచేస్తామ‌ని పేర్కొన్నారు.  

Exit mobile version