Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం.. గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలకు హెచ్చరికలు

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం
  • ఖాళీ చేసి వెళ్లిపోవాలని ప్రజలకు హెచ్చరికలు
  • ఇటీవల ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి
Israellebanon (1)

Israellebanon (1)

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడులకు పాల్పడింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దూసుకెళ్తున్నాయి. భారీ ఎత్తున ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లో మోహరించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే పదుల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 16 గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసి అత్యున్నత పదవిలో ఉన్న అయతుల్లా ఖమేనీని హతం చేశాయి. దీంతో ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ఇక ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్ కూడా కాలు దువ్వింది. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడింది. దీంతో ఐడీఎఫ్ దళాలు లెబనాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. ఓ వైపు ఇరాన్‌పై.. ఇంకోవైపు లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Rates: యుద్ధ సమయంలో మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు