NTV Telugu Site icon

Hama-Israel: హమాస్‌కు చివరికి హెచ్చరిక.. తక్షణమే బందీలను విడుదల చేయాలని అల్టిమేటం

Israeltrump

Israeltrump

హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. తొలి విడత ఒప్పందం ముగిశాక.. సోమవారం ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 400 మందికిపైగా చనిపోయారు. ఇందులో హమాస్ కీలక నేతలంతా ఉన్నారు. ఇక తాజాగా మరోసారి హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేసింది. తక్షణమే బందీలను విడుదల చేయాలని.. అంతేకాకుండా ప్రజలంతా హమాస్ రాజ్యం నుంచి విముక్తి పొంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు గాజాలో ఐడీఎఫ్ దళాలు సైనిక కార్యకలాపాలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఇది కూడా చదవండి: Mega Brothers : ‘మెగాస్టార్ చిరంజీవి’కి పవర్ స్టార్ స్పెషల్ విషెష్

ఇక ఇజ్రాయెల్ హెచ్చరికలతో గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో పిల్లలు, పెద్దలు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత అనుభవం దృష్టిలో పెట్టుకుని మోసుగలిగే వస్తువులను తీసుకుని వెళ్లిపోతున్నారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం విధించారు. లేదంటే నరకం చూస్తారని హెచ్చరించారు. అన్నట్టుగానే పరిస్థితులు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ భీకరదాడుల వెనుక అమెరికానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గాజా ఖాళీ చేసి వెళ్లిపోవాలని.. అభివృద్ధి చేస్తామని ప్రజలకు ట్రంప్ సూచించారు.

ఇది కూడా చదవండి: US: అమెరికా నుంచి భారతీయ విద్యార్థి బహిష్కరణ.. కారణమిదే!

ఇదిలా ఉంటే తాము ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని హమాస్ తెలిపింది. రెండో ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేస్తామని తెలిపింది. అయితే తొలి ఒప్పందాన్నే కొనసాగించాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. కానీ అందుకు హమాస్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ దళాలు.. గాజాలో మోహరించాయి.