Israel-Iran War: ఇజ్రాయిల్‌పై ముప్పేట దాడి.. హౌతీ-హిజ్బుల్లా-ఇరాన్ అటాక్..

Israel Iran War (3)

Israel Iran War (3)

Israel-Iran War: ఇజ్రాయిల్‌-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ రగులుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఈ రోజు ఇరాన్ పై దాడులు నిర్వహించాయి. టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ టార్గెట్‌గా దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్‌పై వరసగా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణుల్ని దాదాపుగా అడ్డుకుంటున్నాయి.

Read Also: Israel-Iran War: మేము మీతో ఉన్నాం: ఇరాన్ ప్రజలకు “మొసాద్” సందేశం..

మరోవైపు, ఇజ్రాయిల్‌పై ఇరాన్ ముప్పేట దాడిని ప్రారంభించింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై 70 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయిల్‌లో హై అలర్ట్ నెలకొంది. జెరూసలెం, హైఫా, షెఫలా వంటి నగరాల్లో సైరన్లు వినిపించాయి. ఇరాన్‌తో దాని ప్రాక్సీలు కూడా ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతున్నాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్‌లోని హిజ్బుల్లాలు ఇజ్రాయిల్‌పై దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇజ్రాయిల్ ప్రజలు బాంబ్ షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.