NTV Telugu Site icon

IMF: ఇంధన ధరలు, ప్రపంచ జీడీపీపై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ ప్రభావం..

Gita Gopinath

Gita Gopinath

IMF: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచం రెండుగా చీలి ఇరు వైపుల పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వేళ ఇప్పుడు ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్య ప్రపంచం ముందు నిలిచింది.

దీనిపై ప్రపంచ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చమురు ధరలు, ద్రవ్యోల్భణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. ప్రపంచ జీడీపీని దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధం ప్రాంతీయ సంఘర్షణగా మారి, మరిన్ని దేశాల ప్రమేయం ఉంటే ఇది అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం చూపిస్తుందని చెప్పారు.

Read Also: Israel: రెండో దశకు మీరు సిద్ధమా..? సైనికులతో ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు.. పెద్దగా ప్లాన్ చేస్తోంది..

ప్రపంచంలోని ఇతర దేశాలు ఆర్థిక పరిణామాల, ఈ యుద్ధం ఏలాంటి టర్న్ తీసుకుంటుందనే దానిపై ఆధారపడి ఉందని అన్నారు. పౌరనష్టం పరంగా అక్కడి విషయాలు హృదయవిదారకంగా ఉన్నాయని గీతా గోపీనాథ్ అన్నారు. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం చమురు ధరల్లో 10 శాతం పెరుగుదల ఉంటే.. అది జీడీపీని 0.15 శాతం తగ్గిస్తుందని, ద్రవ్యోల్భణాన్ని 0.4 శాతం పెంచుతుందని చెప్పారు. యుద్ధం వలస సమస్యలకు దారి తీస్తుందని, ఇది ఆ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు.

తాము ఇంధన ధరల్లో అస్థిరత గురించి ఆందోళన చెందుతున్నామని, ఇప్పటికే ఓ గ్యాస్ పైప్ లైన్ దెబ్బతినడం(నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్) వల్ల ఐరోపాలో గ్యాస్ ధరలు పెరగడాన్ని ఆమె ప్రస్తావించారు. ఆయా దేశాలు ద్రవ్యోల్భణంతో పోరాతున్నాయని చెప్పారు.