Israel Hamas War: ఖాన్ యూనిస్ నగరం లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 9 మంది మృతి
- ఖాన్ యూనిస్ నగరం లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం
- 9 మంది మృతి.. పలువురికి గాయాలు
- హెచ్చరికలు జారీ చేసిన గంటల్లోనే బాంబుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు. పాలస్తీనా ఆరోగ్య అధికారులు మంగళవారం తెలియజేశారు. ఒక రోజులోపు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది. ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని చెప్పిన గంటల వ్యవధిలోనే యూరోపియన్ హాస్పిటల్ సమీపంలోని ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు.

Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపుదాడికి దిగాయి. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికిపైగా సామన్య ప్రజలకు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఖాన్ యూనిస్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సోమవారమే ఆదేశించింది. అంతలోనే దాడులకు తెగబడింది.
ఇది కూడా చదవండి: SKY: ఫైనల్స్‌లో కెప్టెన్ తనతో చెప్పిన మాటలను రివీల్ చేసిన సూర్య కుమార్..
ఖాన్ యూనిస్‌లోని నిస్సార్ ఆస్పత్రిలో ఉగ్రవాదులు ఉన్నారని పసిగట్టిన ఇజ్రాయెల్ సేనలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకున్నాయి. ఖాళీ చేయాలని ముందే హెచ్చరించినందున కాల్పులకు దిగాయి. అప్పటికే చాలా వరకు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రక్రియ చివరి దశలో ఉండగానే సైన్యం బాంబుదాడులు చేసిందని నిస్సార్ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. దీనివల్లే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరోవైపు అక్కడికి దగ్గర్లోని యూరోపియన్ ఆస్పత్రి చుట్టుపక్కల భవనాలపైనా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఆ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై స్పష్టత లేదు.
ఇది కూడా చదవండి: Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..
- Tags
- GAZA
- Hamas
- Israel
- Khan younis
- Overnight
తాజావార్తలు
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!