NTV Telugu Site icon

Israel Hamas War: ఖాన్‌ యూనిస్‌ నగరం లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 9 మంది మృతి

Attck

Attck

దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు. పాలస్తీనా ఆరోగ్య అధికారులు మంగళవారం తెలియజేశారు. ఒక రోజులోపు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది. ఇజ్రాయెల్ ఖాళీ చేయాలని చెప్పిన గంటల వ్యవధిలోనే యూరోపియన్ హాస్పిటల్ సమీపంలోని ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు.

దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరంలో హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు మెరుపుదాడికి దిగాయి. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఐడీఎఫ్‌ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికిపైగా సామన్య ప్రజలకు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఖాన్‌ యూనిస్‌ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ సోమవారమే ఆదేశించింది. అంతలోనే దాడులకు తెగబడింది.

ఇది కూడా చదవండి: SKY: ఫైనల్స్లో కెప్టెన్ తనతో చెప్పిన మాటలను రివీల్ చేసిన సూర్య కుమార్..

ఖాన్‌ యూనిస్‌లోని నిస్సార్‌ ఆస్పత్రిలో ఉగ్రవాదులు ఉన్నారని పసిగట్టిన ఇజ్రాయెల్‌ సేనలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకున్నాయి. ఖాళీ చేయాలని ముందే హెచ్చరించినందున కాల్పులకు దిగాయి. అప్పటికే చాలా వరకు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రక్రియ చివరి దశలో ఉండగానే సైన్యం బాంబుదాడులు చేసిందని నిస్సార్‌ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. దీనివల్లే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరోవైపు అక్కడికి దగ్గర్లోని యూరోపియన్‌ ఆస్పత్రి చుట్టుపక్కల భవనాలపైనా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. ఆ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై స్పష్టత లేదు.

ఇది కూడా చదవండి: Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు..