Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel Closes Al Aqsa Mosque Ramadan 2026 Arab League Reaction

Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..

Published Date :March 17, 2026 , 7:02 am
By BV Reddy
  • రంజాన్ మాసంలో ‘‘అల్-అక్సా’’ మసీదు క్లోజ్..
  • ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ నిర్ణయం..
  • ఇజ్రాయిల్‌పై ముస్లిం దేశాల ఆగ్రహం..
Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Al-Aqsa Mosque: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ గత 16 రోజులుగా ముస్లింలకు పవిత్రమైన మసీదుల్లో ఒకటైన ‘‘అల్ అక్సా మసీదు’’ను మూసేసింది. రంజాన్ మాసంలో ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నాయి. రంజాన్ సందర్భంగా మసీదు మూసివేయాలని ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాల కూటమి ‘‘అరబ్ లీగ్’’ ఆదివారం తీవ్రంగా విమర్శించింది.

ముస్లింల ప్రార్థనా స్థలాలను మూసేసి, అక్కడ ప్రార్థనలు చేయకుండా చేసే హక్కు ఇజ్రాయిల్‌కు లేదని అరబ్ లీగ్ పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఇజ్రాయిల్ చర్యలు ప్రాంతీయ, ప్రపంచశాంతి, భద్రతలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పింది. జెరూసలేం పవిత్ర స్థలాలపై ఇజ్రాయిల్ చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలను ఆపాలని, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ లీగ్ ప్రపంచదేశాలను విజ్ఞప్తి చేసింది. ఆరాధనా స్వేచ్ఛను గౌరవించేలా దేశాలు చూసుకోవాలని అరబ్ లీగ్ పిలుపునిచ్చింది.

Read Also: Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

అరబ్ లీగ్‌తో పాటు అనేక సంస్థలు, దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఎనిమిది అరబ్-ఇస్లామిక్ దేశాలు మసీదు మూసివేతను సంయుక్తంగా ఖండించాయి.ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC), ముస్లిం వరల్డ్ లీగ్ (MWL), అల్-అజార్, ఆఫ్రికన్ యూనియన్, అరబ్ పార్లమెంట్ కూడా ఇజ్రాయిల్ నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఇది ప్రార్థనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. 1967 తర్వాత, ఇలా ఇన్ని రోజులు మసీదును మూసేయడాన్ని పాలస్తీనియన్ అథారిటీ ఖండించింది. హమాస్ దీనిని ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణంచింది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌తో మొదలైన యుద్ధంతో ఆక్రమిత జెరూసలేంలోని అల్ అక్సా మసీదును ఇజ్రాయిల్ మూసేసిన సమయంలో అరబ్ లీగ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఇబ్రహీమి మసీదులో కేవలం 50 మంది మాత్రమే ప్రార్థన చేయడానికి అనుమతిస్తున్నారు. 1967లో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను ఆక్రమించినప్పటి నుండి ఇది అతి పొడవైన రంజాన్ షట్‌డౌన్‌గా మారింది. భద్రతా కారణాలు, ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగాయనే కారణంతోనే మూసివేసినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Al-Aqsa Mosque Shutdown
  • Arab League
  • Ibrahimi Mosque
  • Israel Defense
  • Israel-Iran War

తాజావార్తలు

  • Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..

  • Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions