గత రెండు రోజులుగా లెబనాన్‌లో కమ్యూనికేషన్ పరికరాలు పేలుళ్లు హడలెత్తించాయి. ఆ ఘటనలో ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 3000 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా దక్షణి లెబనాన్‌పై బాంబుల వర్షం కురిసింది. దీంతో మరోసారి లెబనాన్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లుగా హిజ్బుల్లా చీఫ్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Anna Canteens: రెండో విడతలో 75 అన్న క్యాంటీన్ల ప్రారంభం..
హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తు్నట్లుగా కనిపిస్తోంది. హిజ్బుల్లా.. పౌరుల గృహాలు ఆయుధాలుగా మార్చినట్లుగా తెలుస్తోంది. కింద సొరంగాలు తవ్వి.. పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.
పేజర్, వాకీ-టాకీ దాడులను హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఖండించారు. ‘‘ఉగ్రవాద చర్య’’గా పేర్కొ్న్నారు. లెబనాన్ వాసులు కమ్యూనికేషన్ పరికరాలను విడిచిపెట్టేశారు. అయితే ఈ దాడులపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ స్పందించలేదు. మరోవైపు కమ్యూనికేషన్ పరికరాలను విడిచిపెట్టాలని ప్రజలకు లెబనాన్ పిలుపునిచ్చింది. విమానాల్లో కూడా ఉపయోగించొద్దని కోరింది. తదుపరి నోటీసు వచ్చే వరకు బీరుట్ విమానాశ్రయం నుంచి విమానాలలో వాకీ-టాకీలు మరియు పేజర్లను తీసుకెళ్లకుండా లెబనీస్ అధికారులు నిషేధించారు.
అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. కొందరిని బందీలుగా తీసుకుపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతుంది. దాదాపు ఏడాది నుంచి హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇది కూడా చదవండి: Spirit: ‘స్పిరిట్’లో భార్య భర్తల విలనిజం? అసలేం ప్లాన్ చేస్తున్నావ్ వంగా?