NTV Telugu Site icon

Israel: గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్..

Gaza

Gaza

Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు.

Read Also: Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు మరోసారి పెరోల్.. నాలుగేళ్లలో 9వ సారి..

ఇదిలా ఉంటే.. తాజాగా ఇజ్రాయిల్ గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయిల్‌ని యునైటెడ్ స్టేట్స్ జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌ని వివరణ కోరినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ, ఈ విషయంపై మరింత వ్యాఖ్యానించడానికి తన వద్ద తగినంత సమాచారం లేదని, అయితే హమాస్ తన సైనిక అవసరాల కోసం ప్రజల మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తుందని ఆరోపించారు.

దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరాన్ని ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుంది. ఆ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తోంది. హమాస్ మిలిటెంట్లు, ఇతర నాయకులకు ఇది కంచుకోటగా ఉంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో 1200 మంది ప్రజలు మరణించారు. 240 మందిని హమాస్ బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. పాలస్తీనాలో 24,620 మంది ప్రజలు చనిపోయారు.