Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Islamabad Locked Down Ahead Of Planned Protest By Imran Khans Party In Pakistan

Pakistan: ఇస్లామాబాద్ లాక్‌డౌన్.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా నిరసనలు..

Published Date :November 24, 2024 , 6:30 pm
By Venu Goapl Reddy
  • పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో మరోసారి లాక్‌డౌన్..
  • మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా మార్చ్..
Pakistan: ఇస్లామాబాద్ లాక్‌డౌన్.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా నిరసనలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మరోసారి లాక్‌డౌన్ విధించారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల సమయంలో, ప్రధాన దేశాల నేతలు రావడంతో ఇస్లామాబాద్‌-రావల్పిండిలో లాక్‌డౌన్ విధించింది. తాజాగా మరోసారి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కోసం అతని మద్దతుదారులు తీవ్ర నిరసనలకు సిద్ధమయ్యారు. ఇస్లామాబాద్ వైపు పాదయాత్రగా వెళ్లేందుకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ “బానిస సంకెళ్ళను తెంచడానికి” మార్చ్‌లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

భారీ భద్రతా బలగాలను మోహరించడం, కీలక రహదారుల్ని మూసివేయడంతో పాటు పలు భద్రతా చర్యల్ని తీసుకుంటున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇస్లామాబాద్‌లో ఎలాంటి నిరసనలు, బైఠాయింపులను అనుమతించబోమని, ప్రజాశాంతికి విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అక్కడి హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిరసన కోసం ప్రజలు ఏకం కావాలని, ఇది స్వేచ్ఛ మరియు న్యాయం కోసం జరిగే ఉద్యమం అని ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Also Read

  • Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
  • Condom Prices: బెడ్‌రూమ్‌లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!

Read Also: Mohan Bhagwat : భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉంది.. మంచి బుద్ధి, హృదయాన్ని ఇచ్చేది భారతీయ సంస్కృతి

ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ తన ఇంట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇస్లామాబాద్‌ మార్చ్‌కి నాయకత్వం వహించడానికి గండాపూర్ సిద్ధమయ్యాడు. మార్చ్‌కి హాజరుకావాలని భావిస్తున్న కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్వాబీ చేరుకోవాలని అతను ఆదేశించారు. ఫిబ్రవరి 08న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ని విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ని అక్కడి అధికారులు మూసేశారు. శ్రీనగర్ హైవే, GT రోడ్ మరియు ఎక్స్‌ప్రెస్‌వేతో సహా నగరం అంతటా కంటైనర్లను మోహరించారు. డీ-చౌక్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాల్లో కదలికల్ని పరిమితం చేశారు. పెషావర్ మరియు రావల్పిండి, లాహోర్ మరియు రావల్పిండి మధ్య, అలాగే ముల్తాన్ మరియు ఫైసలాబాద్ నుండి రావల్పిండి మధ్య రైలు సేవల్ని నిలిపేవారు. సెక్షన్ 144 విధించారు. నవంబర్ 2-25 మధ్య నగరం అంతటా సెక్షన్ అమలులో ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Imran Khan
  • Islamabad
  • Pakistan

తాజావార్తలు

  • Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్‌కు తొలి ఆహ్వానం!

  • Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?

  • Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!

  • Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం

  • Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions