NTV Telugu Site icon

Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?

Kim

Kim

Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు, ప్రపంచం మొత్తం నియంతగా పిలిచే కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసిన సంచలనమే. స్వీయ నిర్భందంలో ఉండే ఈ దేశంలోని వార్తలు ప్రపంచానికి చాలా వరకు తెలియవు. ఇక కిమ్‌‌కి సంబంధించిన విషయాలు మరింత రహస్యమే. అయితే, ఇప్పుడు ఓ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. కిమ్ జోంగ్ ఉన్‌కి రహస్య ప్రేమికురాలు ఉందని, ఆమె పేరు హ్యోన్ సాంగ్ వోల్ అని వార్తలు గుప్పుమంటున్నాయి. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా జన్మించిందనే వార్తలు ఉన్నాయి.

ఉత్తర కొరియా ప్రీమియర్ గర్ల్ గ్రూప్, మెరన్ బాండ్ బ్యాండ్‌లో నుంచి బయటకు వచ్చిన హ్యోన్ సాంగ్ వోల్ ప్రస్తుతం కిమ్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. గత వారం రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్‌తో వోల్ కనిపించారు. అయితే, గూఢచారులు మాత్రం వీరిద్దరి మధ్య సంబంధం ప్రొఫెషనల్ కంటే ఎక్కువ అని, వారిద్దరికి బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల వీరిద్దరు కనిపించిన సమయంలో పక్కన ఉన్న సిబ్బంది అంతా నోట్స్ రాసుకుంటుంటే, వోల్ మాత్రం సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసుకోవడం కనిపిస్తోంది.

Read Also: PM Modi: ‘‘ అంబేద్కర్ తిరిగి వచ్చినా..’’ రాజ్యాంగంపై ప్రతిపక్షాల ఆరోపణలపై మోడీ ఫైర్..

దక్షిణ కొరియాలోని నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఎన్ఐఎస్)కి చెందిన చోసు-యోంగ్ మాట్లాడుతూ.. వీరిద్దరి బిడ్డకు కిమ్ ఇల్-బాంగ్ అనే పేరు పెట్టారని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ అతని భార్య రిసోల్ జుకి చట్టబద్దమైన కుమారుడు కూడా ఉన్నాడని పేర్కొన్నాడు. అతను ప్రజాజీవితానికి చిన్నగా ఉన్నాడని చెప్పారు. అయితే, కిమ్-వోల్‌కి పుట్టిన కుమారుడు కిమ్ ఇల్ బాంగ్ దృఢంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. కిమ్ జోంగ్ ఉన్ స్విట్జర్లాండ్‌లో చదువుకునేటప్పుడు హ్యూన్ సాంగ్ వోల్‌ని కలిశాడని, ఈమె కిమ్, అతని సోదరి కిమ్ యో జోంగ్‌కి కేర్ టేకర్‌గా చేశారని, ఉత్తర కొరియాకు తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి బంధం ఏర్పడి కొనసాగిందని చెప్పాడు.

2012 నుంచి దక్షిణ కొరియా నివేదిక ప్రకారం.. కిమ్ తండ్రి కిమో జోంగ్ ఇల్ వీరిద్దరి సంబంధాన్ని అంగీకరించలేదని, విడిపోవాలని ఆదేశించారని, కానీ అతని మరణం తర్వాత కిమ్ సంబంధాన్ని కొనసాగించారని తెలుపుతున్నాయి. నార్త్ కొరియా లీడర్ షిప్ వాచ్ వ్యవస్థాపకుడు మైఖేల్ మాడెన్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లో కిమ్ చదువుకుంటున్న తరుణంలోనే వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో వీరిద్దరు కలిసి ఉండొచ్చని అన్నారు. హ్యూన్ కిమ్ కంటే ఏడేళ్లు పెద్దదని అంచనా వేశారు. ప్రస్తుతం ఆమె కిమ్ వ్యక్తిగత సెక్రటేరియట్‌లో పనిచేస్తోంది. అతని షెడ్యూల్, ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్ల వంటి వాటిని సమన్వయం చేస్తుంది. ఉత్తర కొరియా టెలివిజన్ ఈవెంట్లు, మీడియా ప్యాకేజింగ్‌లో ఆమె ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది.

Show comments