Site icon NTV Telugu

China: ప్రజల దృష్టిని మళ్లించే పనిలో డ్రాగన్ కంట్రీ.. అరుణాచల్, తైవాన్‌పై దాడికి ప్లాన్ చేస్తుందా..?

China

China

China: డ్రాగన్ కంట్రీ చైనా తన జిత్తులమారి వేషాలు తగ్గించుకోవడం లేదు. సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలతో చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, ప్రపంచ స్థాయిలో భారత్ ఎదుగుదలను చైనా జీర్ణించుకోలేకపోతోంది. సరిహద్దు సమస్యలతో భారత్ ను చికాకు పెట్టాలని చూస్తోంది. అందుకే భారతదేశంలో అంతర్బాగంగా ఉన్న ప్రాంతాలనున తనవిగా చెప్పుకుంటోంది. భారత్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, సరిహద్దు సమస్యలతో సతమతమయ్యేలా ప్లాన్ చేస్తోంది.

ఆర్థిక సమస్యలతో సతమతం:

చైనా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. అక్కడ కంపెనీల్లో వేతనాల పెంపు లేదు. ఉద్యోగుల కోత వల్ల అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ప్రజల్లో షి జిన్ పింగ్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఢమాలైంది. బ్యాంకులు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు విదేశీ కంపెనీలు చైనా నుంచి నెమ్మదిగా వేరే దేశాలకు ముఖ్యంగా ఇండియా, ఇండోనేషియా దేశాలకు తరలివెళ్తున్నాయి. గత కొద్ధి రోజుల్లో 10 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి.

మరోవైపు ప్రత్యర్థిగా ఉన్న ఇండియా మాత్రం రోజురోజుకు ఆర్థికంగా బలపడుతోంది. ఇది ఆ దేశానికి మింగుడుపడటం లేదు. ఐఎంఎఫ్ తో పాటు పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం ఈ ఏడాది భారత్ ప్రపంచంలో ఎక్కవ ఆర్థిక వృద్ధి సాధిస్తుందని చెబుతున్నాయి. మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ప్రజల దృష్టిని మళ్లించేందుకే:

చైనాలో జిన్ పింగ్ పాలనపై నానాటికి పెరుగుతున్న వ్యతిరేఖతను కప్పిపుచ్చుకునేందుకు అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ముఖ్యంగా భారత్ లోని లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాలు తనవిగా చెప్పుకుంటూ కొత్త మ్యాపులను కూడా చైనా రిలీజ్ చేసింది. భారతదేశంలోని భూభాగాలే కాకుండా, తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిఫ్పీన్స్, వియత్నాం, బ్రూనై, జపాన్ దేశాలకు చెందిన ద్వీపాలను కూడా తన భూభాగాలుగా పేర్కొంటూ స్టాండర్డ్ మ్యాపులను ప్రచురించింది. ఇలా వివాదాలు రెచ్చగొట్టి చైనా ప్రజల్లో జాతీయ భావాలను రేకిత్తించాలని చూస్తోంది. తద్వారా ప్రజల దృష్టిని మరల్చాలని ప్లాన్ చేస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్, తైవాన్‌పై దాడికి ప్లాన్..?:

1962 సంవత్సరంలో చైనాలో ఎదురవుతున్న వ్యతిరేకతను తట్టుకునేందుకు కమ్యూనిస్ట్ పాలకులు భారత్ పై యుద్ధానికి దిగారు. అయితే ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని పాటించాలని చైనా భావిస్తున్నట్లు అనుమానాాలు వ్యక్తం అవుతున్నాయి. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లేదా తైవాన్ పై దాడికి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్ చైనా విధానాన్ని తైవాన్ అంగీకరించకపోవడంతో గత కొంత కాలంగా తైవాన్ ప్రాంతంలో పీఎల్ఏ బలగాలను పంపి ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. అయితే గతంతో పోలిస్తే భారత్, చైనాకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ఆ దేశం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Exit mobile version