NTV Telugu Site icon

Ireland: ఐర్లాండ్ లో ఇద్దరు కేరళ యువకుల దుర్మరణం..

Kerala Boys Drown In Ireland

Kerala Boys Drown In Ireland

Two Kerala youths died in Ireland: ఐర్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటిలో ముగిని చనిపోయారు. కేరళ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలురు బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం వీరిద్దరు మరికొంత మంది స్నేహితులతో కలసి ఉత్తర ఐర్లాండ్ లో ఉన్న సరస్సుకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ నీటిలో మునిగిపోయారు. చనిపోయిన వారిని జోసెఫ్ సెబాస్టియన్, రేవెన్ సైమన్ లు గా గుర్తించారు. వీరితో పాటు మరో 6 మంది సరదాగా ఈతకు వెళ్లారు. ఈ ఘటన విషాదకరమని స్థానిక మీడియా నివేదించింది.

Read Also: Fraud That They Will Give Jobs: మూడు రోజులుగా గుడిలో బంధిగా యువకుడు? బాబు మాయలోడే..!

నార్తర్న్ ఐర్లాండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటిలో బాలురు మునిగిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వెంటనే రెస్క్యూ సిబ్బంది, పారామెడికల్, ఐదుగురు అత్యవసర సిబ్బందిని ప్రమాద ప్రాంతానికి పంపారని తెలిపారు. ఎయిర్ అంబులెన్స్ ను కూడా సిద్ధం చేశారు. ప్రమాదం నుంచి ముందుగా ఒక బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు..అక్కడ అతను చనిపోయాడు. రెస్క్యూ, పోలీస్ డైవర్ల సహాయంతో మరో బాలుడిని నీటి నుంచి బయటకు తీశారు. సంఘటన స్థలంలోనే అతడు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మూడో బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. ఇతడితో పాటు మరో ముగ్గురిని కూడా ప్రమాదం నుంచి రక్షించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన షాక్‌కు గురిచేసినట్లు నార్తర్న్ పోలీస్ వెల్లడించింది.

బాలురంతా ఇటీవల స్థానిక ప్రాథమిక, గ్రామర్ పాఠశాలకు చెందిన వారు. ఇటీవలే వారి జీసీఎస్సీ ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ ఘటనపై డెర్రీ-లండండరీ మేయర్, స్ట్రాజెన్ డిస్ట్రిక్ కౌన్సిలర్ సాండ్రా డఫీ విచారం వ్యక్తం చేశారు. ఐరిష్ రాజకీయ నాయకుడు ఓనీల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Show comments