OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..

  • చమురు ఉత్పత్తి కోటా పెంచకపోతే ఒపెక్‌ను వీడతామని ఇరాక్ హెచ్చరిక.
  • ఇప్పటికే యూఏఈ ఒపెక్ నుంచి నిష్క్రమణ.
  • రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి లక్ష్యంగా ఇరాక్ ప్రణాళిక.
  • సౌదీ ఆధిపత్యంపై సభ్య దేశాల అసంతృప్తి పెరుగుతోంది.
Opec+

Opec+

OPEC:  యూఏఈ తర్వాత ఇరాక్ ఇప్పుడు సౌదీ అరేబియాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్(OPEC)‌లో సౌదీ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి, ఒపెక్ వీడేందుకు ఇరాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చముర ఉత్పత్తి కోటాపై సౌదీతో పలు దేశాలు విభేదిస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ ఒపెక్‌ను వీడింది. ఇప్పుడు ఒపెక్‌లో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాన్ కూడా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది. తమ చమురు ఉత్పత్తి కోటాను గణనీయంగా పెంచకపోతే ఒపెక్‌లో ఉండాలా? వైదొలగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం, ఇరాక్ రోజుకు సుమారు 40 లక్షల బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే, దేశ ఉత్పత్తి సామర్థ్యానికి, దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కోటా పెంచాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దశాబ్ధాల పాటు యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, అంతర్గత అస్థిరత, ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దేశాన్ని పునర్నిర్మించాలంటే మరింత అధిక చమురు ఆదాయం అవసరమని ఇరాక్ భావిస్తోంది. దీని కోసమే తమ కోటా పెంచాలని ఒత్తిడి చేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని ఇరాక్ లక్ష్యంగా పెట్టుకుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

ఒపెక్ అంటే ఏమిటి.?

ఒపెక్ ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల కూటమి. 1960లో ఈ కూటమి ఏర్పడింది. చమురు ధరలు, విధానాలపై ఉత్పత్తి ఈ దేశాల నియంత్రణలో ఉంటుంది. మే 1 నుంచి ఈ కూటమి నుంచి యూఏఈ వైదొలగడంతో ఈ సమూహంలో 11 దేశాలు మిగిలాయి. ఇప్పుడు ఇరాక్‌ కూడా వైదొలుగేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇరాక్‌తో పాటు ఈ గ్రూపులో అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా.

ఈ గ్రూపులో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. సౌదీ ప్రపంచ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి తనకు ఇష్టం ఉన్నట్లు ఆయిల్ ఉత్పత్తిని పెంచడం, తగ్గించడం వంటి వాటిని ప్రభావితం చేస్తోంది. ఈ కారణంగానే యూఏఈ ఇటీవల ఒపెక్ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇరాక్ కూడా సౌదీని వ్యతిరేకిస్తోంది. ఇరాక్ ఒకవేళ ఒపెక్ నుంచి బయటకు వస్తే ఆ సంస్థ మరింత వీక్ అవుతుంది.