Site icon NTV Telugu

Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై దాడులు చేస్తాం.. అమెరికన్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్..

Iran Warns Us

Iran Warns Us

Iran Warns US: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై అటాక్ చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించినట్లు ప్రభుత్వ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

Read Also: Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో తీసుకెళ్లి కిరాతక హత్యలు!

గల్ఫ్ దేశాల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్‌తో సహా 18 కంపెనీల పేర్లను పేర్కొంటూ వాటి ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు చేస్తామని ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించినట్లు ప్రభుత్వ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ‘‘ఏప్రిల్ 1వ తేదీ, బుధవారం టెహ్రాన్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుండి ఇరాన్‌లో జరిగే ప్రతి ఉగ్రవాద చర్యకు ప్రతిగా, ఈ కంపెనీలు తమ తమ యూనిట్లను ధ్వంసం చేయడాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఒక ప్రకటనలో ఐఆర్‌జీసి పేర్కొంది. అమెరికా దాని మిత్రదేశాల సైనిక చర్యలకు టెక్నాలజీ, ఏఐ, డేటా సపోర్టు అందిస్తున్నవి ఈ కంపెనీలే అని, అందుకే వీటిని లక్ష్యంగా చేసుకుంటామని చెప్పింది. ఈ సంస్థల్లో పనిచేస్తున్నవారు వెంటనే కార్యాలయాలు విడిచిపోవాలని, భద్రతా కారణాల వల్ల ఈ హెచ్చరిక ఇచ్చినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.

Exit mobile version