Israel -Iran War: ఇజ్రాయిల్ “కిల్ లిస్ట్” నుంచి ఇరాన్ మంత్రి, స్పీకర్ పేర్లు తొలగింపు.. ఎందుకు.?
- ఇజ్రాయిల్ కిల్ లిస్ట్ నుంచి ఇరాన్ మంత్రి, స్పీకర్ పేర్లు తొలగింపు..
- యూఎస్ ఒత్తిడితో వెనక్కి తగ్గిన ఇజ్రాయిల్..
- చర్చల సందర్భంగా వీరిద్దరిని వదిలేసిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel -Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా, ఆయిల్ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందా.? అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్నారు.
Read Also: Shocking Crime: మిల్క్ షేక్‌లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..
Also Read
- Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
- Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తన కిల్ లిస్ట్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, పార్లమెంటరీ స్పీకర్ మొహమ్ద్ ఘాలిబాఫ్లను తొలగించినట్లు సమచారం. చర్చల్లో వీరిద్దరు ప్రధానంగా పాల్గొనే అవకాశం ఉంది. దీంతోనే వీరిద్దరి పేర్లను ఇజ్రాయిల్ తొలగించింది. ఇరాన్లో వీరిద్దరు అగ్రశ్రేణి నెగోషియేటర్లుగా ఉన్నారు. వీరిద్దరిని హత్య చేస్తే చర్చలు, దౌత్య ప్రక్రియ ముందుకు వెళ్లదనే ఉద్దేశంతోనే ఇజ్రాయిల్ తన లిస్టు నుంచి తొలగించింది. మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టులు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నారు.
‘‘ఇజ్రాయిల్ వీరిద్దరి ఆచూకీ తెలుసుకుని అంతం చేయాలని అనుకుంటుంది. వీరిని చంపేస్తే మాట్లాడటానికి ఎవరూ ఉండరని అమెరికాకు చెప్పాం. అందుకే అమెరికా ఇజ్రాయిల్‌ను వెనక్కి తగ్గాలని చెప్పింది’’ అని చర్చల విషయం తెలిసిన పాకిస్తానీ మూలాలు చెబుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే, ఈ ఉపశమనం కేవలం తాత్కాలికమైందేనని, దీనికి ఒక గడువు ఉందని తెలుస్తోంది. ట్రంప్‌తో ఉన్నత స్థాయి చర్చల కోసం మార్గం సుగమం చేసేందుకు ఘాలిబాఫ్, అరాఘ్చీలపై నాలుగు లేదా ఐదు రోజుల వరకు ఇజ్రాయిల్ తన కిల్ లిస్ట్ నుంచి వీరిద్దరిని తొలగించింది.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!