Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Iranian Coast Guard Attacks Indian Crew Mt Siron Oman Coast Incident

Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

Published Date :April 27, 2026 , 5:15 pm
By Shiva Ganesh
Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ దళాలు దాడికి దిగాయి. ఈ నౌకలో 12 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఏప్రిల్ 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. టోగో (Togo) దేశ జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సిరాన్’ (MT Siron) అనే కెమికల్ ట్యాంకర్ ఒమన్‌లోని షినాస్ పోర్ట్ పరిమితికి సమీపంలో ఇతర నౌకలతో కలిసి వెళ్తోంది. ఆ సమయంలో ఇరాన్ కోస్ట్ గార్డ్ ఒక్కసారిగా హెచ్చరిక కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌకలోని భారతీయ సిబ్బంది ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

భారత ప్రభుత్వం స్పందన..
ఈ ఘటనపై కేంద్ర ఓడరేవుల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మన్‌దీప్ సింగ్ రంధవా సోమవారం విలేకరులతో మాట్లాడారు. “ఏప్రిల్ 25న ఎంటీ సిరాన్ నౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందింది. ప్రస్తుతం సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని” ఆయన తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), భారత రాయబార కార్యాలయాలు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సముద్ర ప్రయాణాల్లో భారతీయ నావికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రంధవా స్పష్టం చేశారు. నిజానికి ఇరాన్ దళాలు భారతీయ నౌకలపై ఇలా దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రెండు భారతీయ నౌకలపై దాడులు చేశాయి. వీఎల్‌సీసీ సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ నౌకలు ‘హార్ముజ్ జలసంధి’ దాటుతున్న సమయంలో ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ వరుస ఘటనలపై భారత ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమన్ తీరంలో జరిగిన తాజా ఘటనతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Also Read

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
  • Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian sailors safe in Oman sea
  • Indian seafarers safety
  • Iran firing on Indian vessels
  • Iranian Coast Guard attack Indian crew
  • Ministry of Ports Shipping and Waterways news

తాజావార్తలు

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions