Site icon NTV Telugu

Trump-Iran: ఖమేనీపై దాడి చేస్తే ఖబడ్దార్.. పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ వార్నింగ్

Iranwarning

Iranwarning

అమెరికా-ఇరాన్ మధ్య వార్నింగ్‌ల పరంపర కొనసాగుతోంది. మొన్నటిదాకా ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 28 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాల కాల్పుల్లో 5 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా సైనిక దాడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇంతలో సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికా వెనక్కి తగ్గింది. అయితే ఇరాన్ నాయకత్వ మార్పు జరగాలని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఖమేనీపై దాడి చేయొచ్చన్న వాదనల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీ, సోనిపట్‌లో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై అమెరికా దాడి చేస్తే… ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతుందని పెజెష్కియన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభానికి అమెరికా, దాని మిత్ర దేశాలే కారణం అని ఆరోపించారు.

ఇది కూాడా చదవండి: Tejashwi Yadav: ఆర్జేడీ కొత్త వ్యూహం.. తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్!

ఇదిలా ఉంటే తన హెచ్చరికలతో 800 మంది ఉరితీతలు నిలిచిపోయాయని.. అందుకు ఇరాన్‌కు ధన్యవాదాలు అంటూ శుక్రవారం ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు. అంతకు ముందు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు ఇరాన్‌ వైపు ప్రయాణం చేశాయి. అత్యంత శక్తివంతమైన నౌకలు వెళ్తుండడంతో ఏదో జరుగుతోందని భావించారు. కానీ ఇంతలోనే అమెరికా మిత్ర దేశాల దౌత్యంతో సర్దుమణిగింది.

Exit mobile version