Site icon NTV Telugu

Iran: యుద్ధం మొదలైంది.. ఎక్స్‌లో ఖమేనీ కీలక పోస్ట్

Ayatollahalikhamenei

Ayatollahalikhamenei

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసని.. కానీ ప్రస్తుతం చంపే ఉద్దేశం లేదని చెప్పారు. ప్రస్తుతానికి లొంగిపోతే మంచిదని.. లేదంటే పరిణామాలైతే తీవ్రంగా ఉంటాయని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Ileana: ఏంటి.. ఇలియానా రెండో బిడ్డకు జ‌న్మనిచ్చిందా.. !

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఖమేనీ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘యుద్ధం మొదలైంది’’ అంటూ పోస్టు చేశారు. ఇక కనికరించం అంటూ రాసుకొచ్చారు. ‘‘నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికర్‌తో కలిసి ఖైబర్‌కు వచ్చేశారు’’ అని అందులో రాశారు. అంతేకాకుండా ఖడ్గం పట్టుకుని కోట గేటు దగ్గర ఓ వ్యక్తి ఉన్న ఫొటోను కూడా జత చేశారు. కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా కనిపిస్తోంది. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తర్వాత దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి:Encounter: మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టుల మృతి!

ఇదిలా ఉంటే బుధవారం కూడా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరిగాయి. తెల్లవారుజామున టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అలాగే టెల్ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. ఇక జెరూసలెంలోని అమెరికా ఎంబసీని శుక్రవారం వరకు మూసేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై హైపర్‌ సోనిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్‌ ప్రకటించింది.

 

 

Exit mobile version