Site icon NTV Telugu

Iran-Israel: ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చిన ఇరాన్.. ఎలాంటి ఒప్పందం జరగలేదని వెల్లడి

Iranisrael

Iranisrael

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు పూర్తి స్థాయి విరమణకు అంగీకరించాయని.. 24 గంటల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అయితే ట్రంప్ ప్రకటనను టెహ్రాన్ ఖండించింది. ప్రస్తుతానికి అలాంటి ఒప్పందం ఏమీ జరగలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెల్చి చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ట్రంప్ ప్రకటనపై స్పందించలేదు. దీనిపై మాట్లాడేందుకు ఇజ్రాయెల్ సైన్యం కూడా నిరాకరించింది.

ఇది కూడా చదవండి: Ananthika : ఇది నా జీవితానికి దగ్గరైన పాత్ర.. ‘8 వసంతాలు’ సక్సెస్ పై అనంతిక స్పందన

‘‘ప్రస్తుతానికి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల విరమణపై ఎటువంటి ఒప్పందం లేదు. అయితే ఇజ్రాయెల్… ఇరాన్ ప్రజలపై తన చట్టవిరుద్ధమైన దురాక్రమణను ఉదయం 4 గంటలలోపు ఆపితే.. ఆ తర్వాత మా ప్రతిస్పందనను కొనసాగించే ఉద్దేశం మాకు లేదు. మా సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తర్వాత తీసుకోబడుతుంది.’’ అని అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Veeraiah Chowdary: పోలీస్ కస్టడీకి వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు!

ఇక ట్రంప్ ప్రకటనపై ఇంకా ఇజ్రాయెల్ స్పందన రాలేదు. ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం స్పందించడానికి ఇష్టపడ లేదు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్ వేదికగా ప్రకటించారు. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగుస్తుందన్నారు. ఈ కాల్పుల విరమణకు తొలుత ఇరాన్‌ అంగీకరించిందన్నారు. దీంతో 12 రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో రెండు వారాల యుద్ధానికి ముగింపు పడినట్లే.

 

Exit mobile version