Iran war: ఇరాన్ పాలనలో చీలిక, నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు.? అమెరికా-ఇజ్రాయిల్ ప్లాన్ సక్సెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran war: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు తమ దాడుల్ని మరింత తీవ్రం చేశాయి. మరోవైపు, ఇరాన్‌లో ‘‘పాలన మార్పు’’ను కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్‌లు కొంత మేర సక్సెస్ అయ్యాయని అనిపిస్తోంది. ముఖ్యంగా, ఆ దేశ నాయకత్వంలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ.. తమ పొరుగు దేశాలైన యూఏఈ, కువైట్, ఖతాన్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై దాడులకు చేస్తున్నందుకు క్షమాపణలు కోరారు. ఇకపై దాడులు జరగవని హామీ ఇచ్చారు. అయితే, ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటలకే ఇరాన్ మళ్లీ గల్ఫ్ దేశాలపై దాడులు మొదలుపెట్టింది.
ఖమేనీ తర్వాత ఎవరు.?
Also Read
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
దీనిని బట్టి చూస్తే, ఇరాన్ పాలన నిర్ణయాలు ప్రెసిడెంట్ పెజెష్కియాన్ దగ్గర లేవని తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన స్థానంలో కొత్త నాయకుడు ఎన్నిక జరగలేదు. దీంతో పాలనా బాధ్యతలు , నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ముగ్గురు సభ్యుల తాత్కాలిక మండలి ఏర్పడింది. ఇందులో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్(అధ్యక్షుడు), న్యాయవ్యవస్థ చీఫ్ గోలంహోస్సేన్ మొహ్సేని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ ఎంపిక చేసిన నేత అలిరేజా అరాఫీ ఉంటారు. సుప్రీం నాయకుడు ఎన్నికయ్యే వరకు వీరే నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరిస్తారు.
నిజమైన అధికారాన్ని IRGCనే చెలాయిస్తోందా.?
నిజానికి ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో అన్ని నిర్ణయాలు ఇరాన్‌లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీసుకుంటుందని తెలుస్తోంది. సైనిక వ్యూహాలు, భద్రత, ప్రధాన నిర్ణయాల్లో ఇదే ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీంతో పాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సైన్యం, ఐఆర్‌జీసీ కి మధ్య సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. యుద్ధ సమయాల్లో నిర్ణయాల్లో ఈయన ప్రమేయం బాగా పెరిగింది.
అధ్యక్షుడి ప్రకటనపై అసంతృప్తి:
దాడులు చేస్తున్నందుకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పడం అక్కడి సంప్రదాయవాదులకు రుచించడం లేదు. ఇరాన్‌పైకి ఆ దేశాల నేల నుంచి దాడులు జరగకుంటే తాము కూడా దాడులు చేయమని చెప్పారు. అయితే, ఈ ప్రకటనపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ఇతర మత నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది అంతర్గత విభేదాలను సూచిస్తోంది. మత నాయకుడు హమీద్ రసాయి మాట్లాడుతూ.. ఇది బలహీన, ఆమోదయోగ్యం కాని వైఖరి అని అన్నారు. సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని కూడా అతని ప్రకటనను వ్యతిరేకించారు, “శత్రువు ఈ ప్రాంతంలోని స్థావరాల నుండి మనపై దాడి చేసినప్పుడు, మేము ప్రతిస్పందిస్తాము మరియు మేము ప్రతిస్పందిస్తూనే ఉంటాము.” అని అన్నారు. చివరకు పెజెష్కియాన్ తన ప్రకటనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. అసలు Hanuman Ansh అసలు కథ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!