NTV Telugu Site icon

Iran: ఇండియాకి వస్తున్న ట్యాంకర్‌పై దాడితో మాకు సంబంధం లేదు.. అమెరికా ఆరోపణలపై ఇరాన్..

Iran

Iran

Iran: ఇటీవల అరేబియా సముద్రంలో భారత్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్‌కి వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగింది. అయితే భారత్ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్ ఆరోపించిన తర్వాత టెహ్రాన్ నుంచి ఈ తరహా ప్రతిస్పందన వచ్చింది.

అమెరికా వాదనల్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామని, విలువలేనివిగా ప్రకటిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనాని అన్నారు. ఇటువంటి వాదనలతో గాజాలో నియోనిస్టు పాలన(ఇజ్రాయిల్) నేరాలను అమెరికన్ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఇరాన్ చెప్పింది.

Read Also: Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్‌కి మద్దతుగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. అయితే ఈ హౌతీలకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని దేశాల నౌకా సంస్థలు రెడ్ సీ, సూయజ్ కెనాల్ ద్వారా రాకపోకలను రద్దు చేసుకుంటున్నాయి. యూరప్ నుంచి ఆసియాకు వెళ్లేందుకు ఆఫ్రికా ఖండాన్ని చుట్టివస్తున్నాయి.

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 240 మందిని బందీలుగా చేసుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాను టార్గెట్ చేసి టార్గెట్ చేస్తోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 20,400 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ పూర్తిగా నేలమట్టం అయ్యేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని జెంజమన్ నెతన్యాహూ చెప్పారు.

Show comments