మెక్సికోలో ఇజ్రాయెల్ రాయబారి ఐనాట్ క్రాంజ్-నీగర్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ హత్యకు ప్లాన్ చేశాయని శుక్రవారం వెల్లడించాయి. అయితే ఆరోపణలను టెహ్రాన్ అధికారులు ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ అబద్ధాలు ఆడుతున్నాయని తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్ కుట్రపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని మెక్సికన్ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: PM Modi: వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలను మెక్సికోలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. మెక్సికో-ఇరాన్ మధ్య స్నేహపూర్వక, చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చింది. కుట్ర ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Road Accident: పెళ్లి కారు బీభత్సం.. నలుగురు మృతి, ఏడుగురికి సీరియస్..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదుల లక్ష్యంగా ఇరాన్ అవిశ్రాంతంగా కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆరోపించింది. ఇరాన్ నాయకత్వంలో విదేశాలల్లో ఉగ్రవాద నెట్‌వర్క్ నడుస్తోందని పేర్కొంది. ఆగస్టులో మెల్‌బోర్న్, సిడ్నీలో జరిగిన దాడులే ఉదాహరణగా పేర్కొంది. విదేశాల్లో ఉండే యూదులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. కుట్రను ఛేదించిన మెక్సికో అధికారులకు కృతజ్ఞతలు అంటూ ఇజ్రాయెల్ విదేశాంగ తెలిపింది. అయితే ఈ కుట్రపై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదంటూ మెక్సికో అధికారులు ఖండించారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికా నిరసన.. దక్షిణాఫ్రికా జీ 20 సదస్సుకు ట్రంప్ గైర్హాజరు
