Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran vs US: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటం, అమెరికా ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, కొద్ది రోజుల క్రితమే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లు ప్రకటించారు. అయితే దక్షిణ లెబనాన్ నుంచి దళాల ఉపసంహరణ జరగకపోవడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పదేపదే ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జలసంధిని మళ్లీ మూసివేయడం ద్వారా ఒప్పంద భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
‘ఇది తొలి అడుగు మాత్రమే’.. ఇరాన్ హెచ్చరిక
హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించడం కేవలం తొలి చర్య మాత్రమేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఒప్పంద ఉల్లంఘనలు కొనసాగితే మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం ఏడుగురు మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ చేరుకున్న పాకిస్తాన్ మంత్రి
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఇరాన్‌కు చేరుకున్నారు. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య జరుగుతున్న చర్చలను ఆయన పర్యవేక్షించే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఆయన పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?