NTV Telugu Site icon

Iran: బహిరంగ ఉరిశిక్షలు ప్రారంభించిన ఇరాన్.. ప్రజల మధ్య క్రేన్ కు వెళాడదీసి శిక్ష అమలు

Iran

Iran

Public Execution in iran : ఇస్లామిక్ దేశంలో నేరాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలసిందే. కన్నుకు కన్ను.. చేయికి చేయి.. ప్రాణానికి ప్రాణం అన్న రీతిలో అక్కడ శిక్షా పద్దతులు ఉంటాయి. ఇప్పటీక ఇరాక్, ఇరాన్, సిరియా, సౌదీ, యూఏఈ వంటి దేశాల్లో బహిరంగంగానే మరణశిక్షలు అమలు చేయబడుతున్నాయి. వీటిపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఎన్నిసార్లు గొంతెత్తినా.. ప్రయోజనం లేదు. మధ్యయుగం నాటి ఈ మరణ శిక్షా పద్దతులను విరమించుకోవాలని పలు హక్కుల సంస్థలు కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే రెండేళ్ల తరువాత ఇరాన్ దేశంలో బహిరంగంగా మరణశిక్ష అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. 2022 ఫిబ్రవరిలో ఇరాన్ దక్షిణ నగరం అయిన షిరాజ్ లో ఓ పోలీస్ అధికారిని హత్య చేసిన నేరం కింద ఇమాన్ సబ్జికర్ అనే వ్యక్తిని హత్య జరిగిన చోటే ఉరితీసి చంపారని నార్వేకు చెందిన ఎన్జీఓ ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. పోలీస్ అధికారిని హత్య చేసిన నేరం కింద ఇరాన్ సుప్రీంకోర్టు ఈ నెల మొదట్లో సబ్జికర్ కు ఉరిశిక్షను నిర్థారించింది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ప్రజల మధ్య ఉరి తీశారు.

Read Also: Monkeypox: ఇండియాలో మరో మంకీపాక్స్ కేసు.. ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తిలో వైరస్ గుర్తింపు

ఇలా బహిరంగంగా ఉరితీయడాన్ని ఇరాన్ పున:ప్రారంభించిందని.. ఇది ప్రజలు నిరసన తెలపకుండా భయపెట్టడానికే అని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. మధ్యయుగం నాటి శిక్షలను అమలు పరుస్తున్నారంటూ మండిపడుతున్నాయి. నిజానికి ఇరాన్ లో రేప్, మర్డర్, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలకు జైలులోనే ఉరిశిక్షలు విధిస్తారు. అయితే అధికారులను చంపితే మాత్రం..చంపిన ప్రదేశంలోనే బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్నారు. ఇరాన్ లో చివరి సారిగా జూన్11, 2020న బహిరంగంగా ఉరితీశారు. పోలీస్ అధికారులను వేర్వేరుగా హత్య చేసినందుకు గానూ నలుగురు వ్యక్తులకు కూడా మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు. త్వరలో వీరిని కూడా బహిరంగంగా ఉరితీసే అవకాశం ఉంది.