American Military: ఎర్ర సముద్రంలో యూఎస్ నేవీ వర్సెస్ హౌతీ రెబల్స్.. నౌకల్ని ముంచేసిన నేవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
American Military: ఎర్ర సముద్రం రణరంగంగా మారుతోంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ సముద్రం గుండా వచ్చే వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు అమెరికా మిలిటరీ ఆ ప్రాంతంలో మోహరించింది. రెడ్ సీలో కంటైనర్ షిప్‌లపై దాడులు చేస్తున్న ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగబాటుదారులు నిర్వహిస్తున్న మూడు నౌకల్ని ముంచేసినట్లు యూఎస్ నేవీ తెలిపింది. యూఎస్ నేవీ హెలికాప్టర్లు వీటిపై దాడి చేసినట్లు ఆదివారం వెల్లడించింది.
ముందుగా యూఎస్ హెలికాప్టర్లపై హౌతీలు కాల్పులు జరిపిన తర్వాత, ఆత్మరక్షణ కోసం యూఎస్ నేవీ తిరిగి కాల్పులు జరిపిందని, నౌకకు 20 మీటర్ల దూరంలో ఉన్న నాలుగు చిన్న బోట్లలో మూడింటిని సముద్రంలో ముంచి, అందులో ఉన్న వారిని చంపేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగో పడవ అక్కడ నుంచి పారిపోయిందని వెల్లడించింది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Read Also: Boeing 737 MAX: బోయింగ్ 737 మాక్స్ విమాన రడ్డర్‌లో సమస్యలు.. అప్రమత్తమైన విమానయాన సంస్థలు..
సింగపూర్ జెండాతో ఉన్న, డెన్మార్క్ దేశానికి చెందిన కంటైనర్ షిప్ మార్స్క్ హాంగ్‌జౌ దాడికి గురవుతున్నట్లు తెలిసి, సహాయం కోసం అభ్యర్థించడంతో యూఎస్ నేవీ స్పందించింది. రెడ్ సీ నుంచి ప్రయాణిస్తున్న నౌకలపై 24 గంటల్లో ఇది రెండో దాడి. హౌతీ నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి మార్స్క్ హాంగ్‌జౌను తాకింది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో హమాస్‌కి మద్దతుగా యెమెన్‌లోని హౌతీ రెబల్స్ ఇజ్రాయిల్‌కి సంబంధం ఉన్న నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాటు రెడ్ సీ నుంచి వచ్చీపోయే నౌకలపై డ్రోన్ అటాక్స్ జరుపుతున్నారు. ఈ దాడుల వల్ల ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం నౌకారవాణపై ప్రభావం పడుతోంది. ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఉందని అమెరికా ఆరోపిస్తోంది.
Iranian-backed Houthi small boats attack merchant vessel and U.S. Navy helicopters in Southern Red Sea
On Dec. 31 at 6:30am (Sanaa time) the container ship MAERSK HANGZHOU issued a second distress call in less than 24 hours reporting being under attack by four Iranian-backed… pic.twitter.com/pj8NAzjbVF
— U.S. Central Command (@CENTCOM) December 31, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!