Iran-Mandeb: ఇరాన్ మరో జలసంధిని మూసేబోతుందా? మండేబ్‌పై సర్వత్రా టెన్షన్
- ప్రపంచ వ్యాప్తంగా మరో గ్లోబల్ టెన్షన్
- మరో కొత్త వ్యూహానికి ఇరాన్ ప్లాన్
- గుబుల్ పుట్టిస్తోన్న ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర స్థాయిలోకి మారనుందా? తాజా సంకేతాలు అవే సిగ్నల్స్ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండగా.. ఇక ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దీంతో పరిస్థితులు మరింత టెన్షన్‌గా మారాయి.
ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కోసం అల్లాడిపోతున్నాయి. ఆయా దేశాల్లో చమురు సంక్షోభం తలెత్తి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రపంచ రవాణాకు కీలకమైన మరో సముద్ర మార్గాన్ని మూసేందుకు ఇరాన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. ఎర్ర సముద్రంలో కీలక మార్గమైన బాబ్ ఎల్‑మాండెబ్ జలసంధిని కూడా క్లోజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకునట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
Also Read
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
- Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
- Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ఇందుకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మోహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ చేసిన వ్యా్ఖ్యలు వరల్డ్ వైడ్‌గా గుబులు పుట్టిస్తున్నాయి. ఈ స్ర్తైట్ గ్లోబల్ ట్రేడ్ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని.. అందులో అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం ఎంత పెద్దదో గుర్తించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘బాబ్ ఎల్‑మాండెబ్ ద్వారా గ్లోబల్ ఆయిల్, ఎల్‌ఎన్‌జీ, గోధుమ, బియ్యం, ఎరువుల రవాణా ఎంత?, ఏ దేశాలు, కంపెనీలు ఈ స్ర్తైట్‌లో అత్యధిక వాల్యూమ్ రవాణాను నిర్వహిస్తున్నాయి?.’’ అని ప్రశ్నించారు.
మోహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసేయడం ద్వారా ప్రపంచ దేశాలు ఎలా అల్లాడిపోతున్నాయో ప్రత్యక్షంగా కళ్లు ముందు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ అనుచరులైన హౌతీల చేతిలో ఉన్న బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని కూడా మూసేసి ప్రపంచ దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ వ్యూహం పన్నినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మాండెబ్ జలసంధిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సరఫరా అయ్యే డేటా కేబుళ్లు ఉన్నాయి. ఈ డేటా కేబుళ్లు గనుక హౌతీలు కట్ చేస్తే.. ప్రపంచ దేశాల్లో మొబైల్ సౌకర్యాలు, బ్యాంకింగ్ సర్వీసులు, స్టాక్ మార్కెట్లు ఘోరంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుంది. అలాగే యూరప్ దేశాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. పూర్తిగా గ్లోబల్ ఎకనామీ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంధన మార్కెట్లు, ఆహార భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. హౌతీల కనుసన్నల్లో ఉన్న మాండెబ్ బలసంధిని కూడా మూసేస్తే మాత్రం ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: UP Video: దు:ఖసాగరంగా మారిన ఎస్పీ బదిలీ.. వీడ్కోలు సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన పోలీసులు
ఇది కూడా చదవండి: Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
ఇది కూడా చదవండి: US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?