Iran Attack on Saudi: సౌదీ అతిపెద్ద రిఫైనరి ‘‘అరామ్‌కో’’పై ఇరాన్ మళ్లీ దాడి..

Saudi Aramco's Ras Tanura

Saudi Aramco's Ras Tanura

Iran Attack on Saudi: ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతోంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ అరామ్‌కోకు చెందిర రాస్ తనురా రిఫైనరీపై దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ అరామ్‌కో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కార్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన రంగానికి కీలకంగా ఉంది.

Read Also: YS Jagan: చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ సంచలన ఆరోపణలు.. దేవుడిపై భక్తి లేదు.. ఆలయాలపై శ్రద్ధ కూడా లేదు..!

“రాస్ తనురా శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించారు, ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి డ్రోన్ ద్వారా జరిగిందని, ఫలితంగా ఎటువంటి నష్టం జరగలేదని” ప్రతినిధి చెప్పారు. సోమవారం కూడా ఇరాన్ షాహెద్ ఆత్మాహుతి డ్రోన్లతో ఇలాంటి దాడినే చేసింది. ఈ దాడి కారణంగా సౌదీ అరామ్ కో తన రాస్ తనురా రిఫైనరీని మూసేయాల్సి వచ్చింది.

సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. దీని చమురు క్షేత్రాలు, పెట్రోలియం మౌలిక సదుపాయాలు తూర్పు తీరంలో ఉన్నాయి. ఇవన్నీ ఇరాన్ నుంచి గల్ఫ్ వైపుగా ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో జరిగిన మొదటి డ్రోన్ దాడి తర్వాత, ఎల్‌పీజీ గ్యాస్‌ ఎగుమతుల్ని నిలిపేసింది. ప్రొపేన్, బ్యూటేన్ ఎగుమతిని నిలిపివేయాలనే అరామ్‌కో నిర్ణయం కొన్ని వారాల పాటు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.