Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

  • బాంబ్ దాడులతో అట్టుడుకుతోన్న మధ్యప్రాచ్యం
  • ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులు
  • నెతన్యాహు కార్యాలయం ధ్వంసం
  • ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన
Netanyahu1

Netanyahu1

మధ్యప్రాచ్యం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో పశ్చిమాసియా గజగజ వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. బాంబ్ దాడులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. శనివారం జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం కాగా.. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం టార్కెట్‌గా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు తెగబడింది. ఆపరేషర్ ట్రూప్ ప్రామిస్-4లో భాగంగా ఇరాన్ దాడులు చేపట్టింది.

ఇది కూడా చదవండి: Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై దాడి చేసినట్లు తాజాగా ఇరాన్ పేర్కొంది. నెతన్యాహు కార్యాలయంతో పాటు వైమానిక దళ కమాండర్ కార్యాలయంపై కూడా దాడి జరిగినట్లుగా స్పష్టం చేసింది. నెతన్యాహు ఏమయ్యాడో తెలియదంటూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) వ్యాఖ్యానించింది. అలాగే ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఇంటిపై కూడా దాడి చేశామని పేర్కొంది. నెతన్యాహును ‘‘నేరపూరిత ప్రధాన మంత్రి’’గా ఇరాన్ అభివర్ణించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై నిరంతరం దాడి చేస్తోంది. ఖమేనీతో సహా 40 మంది అగ్ర కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇది కూడా చదవండి: YS Jagan: గల్ఫ్‌లో చిక్కుకున్న ఆంధ్రులను వెంటనే రప్పించండి.. ప్రభుత్వానికి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి..