అంతర్జాతీయ యోగాడే సందర్భంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు యోగాకార్యమాలను నిర్వహిస్తున్నాయి. ఇండియాలో ఉదయం నుంచి యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. మనదేశంలోని గాల్వాన్‌లోయ, లఢాక్ లోని 18వేల అడుగుల ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఐటీబీపి సైనికులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.
Read: లాక్‌డౌన్ తరువాత సందడిగా మారిన మహానగరం…
ఇకపోతే, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మూడు వేల మందితో అధికారులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా మహమ్మారి తరువాత ఇంతమంది ఒకచోట ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నిత్యం యోగాసనాలు వేయడం వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
