లాక్‌డౌన్ త‌రువాత సంద‌డిగా మారిన మ‌హాన‌గ‌రం…

జూన్ 19 వ తేదీతో లాక్‌డౌన్ ముగియ‌డంతో 20 వ తేదీనుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు.  ఆదివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో న‌గ‌రంలోని ప్ర‌జలు రోడ్డుమీద‌కు వ‌చ్చారు.  దాదాపు నెల రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మైన ప్ర‌జ‌లు, లాక్‌డౌన్ ఎత్తివేయ‌డంతో న‌గ‌రంలోని ప్ర‌ముఖ ప్ర‌దేశాల‌ను కుంటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పర్య‌టించేందుకు ఆస‌క్తి చూపించారు.  న‌క్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌, ఎన్‌టీఆర్ గార్డెన్స్‌, లుంబినిపార్క్‌, గోల్కొండ కోట ప్ర‌జ‌ల‌తో కిట‌కిట‌లాడింది.  ఇక చార్మినార్‌లో మరింత సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చార్మినార్ ప్రాంతం సంద‌ర్శ‌కుల‌తో కిక్కిరిసిపోయింది. లుంబినిపార్క్, హుస్సేన్ సాగ‌ర్‌లుకు ప్ర‌జ‌లు పోటెత్తారు.  

-Advertisement-లాక్‌డౌన్ త‌రువాత సంద‌డిగా మారిన మ‌హాన‌గ‌రం...

Related Articles

Latest Articles