Site icon NTV Telugu

China-Taiwan: చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాలు భారీ విన్యాసాలు

China

China

ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనా-తైవాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ దేశం భారీ విన్యాసాలకు దిగుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో కొత్త తలనొప్పి మొదలయ్యేటట్టు కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని యుద్ధాలు ముగింపు దిశకు చేరుకున్నాయి. గత శనివారం థాయ్‌లాండ్-కంబోడియా దేశాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఆదివారం ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ తర్వాత సానుకూల సంకేతాలు వ్యక్తమయ్యాయి. అతి త్వరలోనే రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించనున్నాయి.

ఇలాంటి తరుణంలో జపాన్ ప్రధాని సనే తకైచి చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లైంది. తైవాన్ విషయంలో చైనా జోక్యం చేసుకుంటే.. తాము కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందని సనే తకైచి వ్యాఖ్యానించారు. ఇదే చైనాకు కోపం తెప్పించింది. తాజాగా చైనా దళాలు తైవాన్‌ను చుట్టుముట్టాయి. భారీ ఎత్తున యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. ఇప్పటికే వాయుసేన, నేవీ, రాకెట్‌ ఫోర్స్‌ దళాలు తైవాన్‌ సమీపంలో మోహరించి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Bengaluru: కొత్త జంట షాకింగ్ నిర్ణయం.. వెయ్యి కి.మీ ప్రయాణం చేసి ఏం చేశారంటే..!

తైవాన్ చుట్టూ మంగళవారం లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తుందని.. ద్వీపం చుట్టూ ఉన్న ఐదు జోన్లలో సముద్ర, గగనతల విన్యాసాలు ఉంటాయని రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ‘‘జస్ట్ మిషన్ 2025’’ అని పిలువబడే విన్యాసాలపై దృష్టి సారించినట్లు చైనా సైన్యం తూర్పు థియేటర్ కమాండ్ ప్రతినిధి తెలిపారు. దీంతో చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అయితే చైనా విన్యాసాలను తైవాన్ ప్రభుత్వం ఖండించింది. ఇది కచ్చితంగా సైనిక బెదిరింపేనని పేర్కొంది. ఇటువంటి చర్యలు సంబంధాలు దెబ్బతీస్తాయని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Mexico Train Accident: మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి

Exit mobile version