ఈమధ్య సోషల్ ప్లాట్‌ఫామ్స్ తెగ ఇబ్బంది పడుతున్నాయి. ఉన్నట్టుండి పని చేయడం మానేస్తున్నాయి. నిన్నటికి నిన్న ట్విటర్‌లో ఏదో సమస్య వచ్చినట్టు తేలింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. యూజర్లు ఒక్కసారిగా ట్విటర్ మీద పడ్డారు. అప్పటివరకూ బాగానే పని చేసిన ఇన్‌స్టా, సడెన్‌గా ఆగిపోయింది. లైవ్ సెషన్స్ వాటికవే రీస్టార్ట్ అయ్యాయి. లైవ్ సెషన్స్‌లో కామెంట్స్ కూడా మాయమయ్యాయి. న్యూస్ ఫీడ్ కూడా లోడ్ అవ్వలేదు. దీంతో, తమ మొబైల్‌లో ఏమైనా సమస్య ఉందేమోనని చాలామంది స్విచ్చాఫ్ చేసి స్విచ్చాన్ చేశారు. అప్పటికీ సమస్య పరిష్కారం అవ్వలేదు. మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. అప్పుడు ట్విటర్‌కి విచ్చేస్తే, ఇన్‌స్టా సర్వర్ డౌన్ అయ్యిందన్న సంగతి తెలిసింది.
ఇంకేముంది.. ఇన్‌స్టా యూజర్స్ అందరూ ట్విటర్‌పై దండయాత్ర చేశారు. #InstagramDown అయ్యిందనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ సమస్యలు పంచుకున్నారు. ఈ సమస్యని వెంటనే పరిష్కరించండంటూ ‘మెటా’ సంస్థను విన్నవించారు. మొత్తం 24 వేల మంది యూజర్లు ఇన్‌స్టా డౌన్ అయ్యిందని ఫిర్యాదు చేసినట్టు downdetector.com వెబ్‌సైట్ వెల్లడించింది. కొన్ని వారాల క్రితమే ఇన్‌స్టా స్టోరీ విషయంలో సరిగ్గా ఇదే ప్రాబ్లమ్‌ని యూజర్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. స్టోరీలు అస్సలు ఓపెన్ అవ్వకపోవడం, లోడ్ కాకపోవడం వంటి ఇష్యూస్‌ని ఫేస్ చేశారు. అప్పుడు ఆ సమస్యని కొన్ని గంటల వ్యవధిలోనే సాల్వ్ చేశారు. ఇప్పుడు తాజా సమస్యని సైతం వెంటనే పరిష్కరించడంతో, యూజర్స్ ఊపిరి పీల్చుకున్నారు.